ఉల్లాస్ అక్షరాంద్రలో భాగంగా జోరుగా రాత్రి బడులు
PPM: ఉల్లాస్ అక్షరాంద్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి మక్కువ మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి బడులు జోరుగా సాగాయి. రెండో విడత కార్యక్రమంలో 3,000 మంది మహిళా సంఘాలు సభ్యులను అక్షరాస్యులుగా మార్చడానికి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిన నేపథ్యంలో ప్రతి 10 మందికి ఒక వాలంటీర్ చదవడం, రాయడం, డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తున్నామని APM జయకుమార్ తెలిపారు.