VIDEO: మహిళపై అత్యాచారం.. కేసు నమోదు
అన్నమయ్య: జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిటీఎం మండలం పట్టంవారిపల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళను గత నెల 19వ తేదీన నిందితుడు కిడ్నాప్ చేసి కర్ణాటకకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేశారు.