'విద్యార్థులు విద్యాభ్యాసం చేసి సేవలందించారు'
కృష్ణా: వానపాముల గ్రామంలో ఎస్.ఆర్.ఆర్ & వీ.సీ.ఆర్ జెడ్.పి. హై స్కూల్ శతాబ్ది వేడుకల్లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఈరోజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇదే నేలపై వందేళ్లుగా వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసి సమాజానికి అమూల్య సేవలందించారన్నారు. గురువుల త్యాగం, పూర్వ విద్యార్థుల సహకారం లేకుండా ఈ శతాబ్ది ప్రయాణం సాధ్యమయ్యేది కాదని తెలిపారు.