క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం: సీఐ వెంకటయ్య
SRPT: క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని పట్టణ సీఐ వెంకటయ్య పేర్కొన్నారు. ఆదివారం అంబేడ్కర్ నగర్‌లో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి ,యువతతో కలిసి బ్యాట్ పట్టారు. త్వరలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రానుందని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని అన్నారు.