ప్రశంసాపత్రాలు అందుకున్న 108 సిబ్బంది

ప్రశంసాపత్రాలు అందుకున్న 108 సిబ్బంది

GDWL: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన వేడుకల్లో 108 సిబ్బంది సేవలను గుర్తించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ సంతోష్ చేతుల మీదుగా జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య, ఈఎంటీలు నవీన్ కుమార్, ఇజ్రాయెల్, జంగీర్, పైలెట్లు ఆంజనేయులు, సీను, రవి, అలాగే 102 సిబ్బంది సురేష్ శుక్రవారం ఈ ప్రశంసాపత్రాలను అందుకున్నారు.