కందుకూరులో ఘనంగా 'బడిబాట ర్యాలీ'
KMM: వేంసూరు మండలం కందుకూరులో PM SHRI ZPHS, ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో సోమవారం 'బడిబాట ర్యాలీ'ని నిర్వహించారు. ఈ ర్యాలీలో సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి పాల్గొని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు శ్రీనివాసరావు, ధర్మారావు పాల్గొన్నారు.