మాడవి తుకారాంకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

మాడవి తుకారాంకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

ADB: మాడవి తుకారాం ఆదివాసీ సమాజంలో జన్మించి ఐఏఎస్ స్థాయికి చేరుకున్న గొప్ప మేధావి అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కొనియాడాడు. శనివారం మండలంలోని లక్షెట్ పేట, ఎక్స్ రోడ్డులలో మాడవి తుకారాం వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్స్ రోడ్డులో గల మాడవి తుకారాం విగ్రహానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆయన కుటుంబ సభ్యులు, ఆదివాసీ నాయకులు, పూల మాలలు వేసి నివాళులర్పించారు.