'తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట'
AP: సీఎం చంద్రబాబుపై మాజీమంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. 'తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. ప్రజాస్వామ్యాన్ని తప్పుడుదారిలో నడిపించడంలో బాబు వింతపోకడలకు పోతున్నారు. ఓ పార్టీలో గెలిచిన MLAలను మంత్రులుగా ప్రమాణం చేయించారు. వ్యక్తులను ప్రలోభాలకు గురిచేయటంలో ఆయనకు ఆయనే సాటి. చంద్రబాబు రాజకీయ అనైతిక క్రీడలో భాగమే మా పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలు' అని పేర్కొన్నారు.