విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

ELR: వాహనదారులు తాము ప్రయాణించే సమయంలో వేగం కన్నా, ఎదుటివారి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పూళ్ళ సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, కార్యదర్శి సునంద కోరారు. పూళ్ల శివారు ఎంఎం.పురంలో హై స్కూల్ విద్యార్థులకు సోమవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ సిబ్బంది లక్ష్మీ సుజన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం డాక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.