VIDEO: రాచర్లలో బండలాగుడు పోటీలు ప్రారంభించిన MLA

VIDEO: రాచర్లలో బండలాగుడు పోటీలు ప్రారంభించిన MLA

ప్రకాశం: రాచర్ల మండలం జె.పుల్లల చెరువులో స్వయంభూ శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం బండలాగుడు పోటీలను ఘనంగా నిర్వహించారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో కళకళలాడింది. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, యువకులు శనివారం తరలివచ్చారు. పోటీలను ఆసక్తిగా వీక్షించారు. MLA ముత్తుముల అశోక్ రెడ్డి పోటీలను ప్రారంభించారు.