పెరిగిన టమాట ధర.. కేజీ ఎంతంటే?
సత్యసాయి: అనంత గ్రామీణం కక్కలపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మార్కెట్‌లో విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. నాలుగు మండీలకు 5టన్నులే వచ్చాయి. కిలో గిరిష్టం రూ.25, మధ్యస్థం రూ.17, కనిష్టం రూ.12 చొప్పున ధరలు పలికాయి. 15కిలోల బుట్ట గరిష్టం రూ.400 మధ్యస్థం రూ.255, కనిష్టం రూ.180 చొప్పున దరలు పలికాయని మార్కెట్ ఇన్‌చార్జి రూప్‌కుమార్ తెలిపారు.