IBOMMA నిర్వాహకుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
HYD: IBOMMA నిర్వాహకుడు రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్ కేసులో రవిని చంచల్ గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు అనుమతించిన 5 రోజుల కస్టడీ మేరకు రవిని జైలు నుంచి బయటకు తీసుకెళ్లారు. రవి నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టనున్నట్లుగా తెలుస్తోంది.