చైనా వీసాల రద్దు దిశగా అమెరికా

చైనా విద్యార్థుల వీసాలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంచలన ప్రకటన చేశారు. బీజింగ్ విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా పరిశోధనా రంగాల్లో చదువుకుంటున్న వారితో పాటు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్న విద్యార్థుల వీసాలను రద్దు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనపై ఇప్పటివరకు చైనా స్పందించలేదు.