హనకనకల్‌లో సీసీ రోడ్డు ప్రారంభం
ATP: రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హనకనకల్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ రహదారి గ్రామస్తుల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడం ప్రభుత్వ కర్తవ్యమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల పురోగతికి మౌలిక సదుపాయాలు కీలకం అని తెలిపారు.