జమ్మలమడుగులో ఢిల్లీ ఉగ్రదాడిలో మృతులకు నివాళి
KDP: ఢిల్లీలో ఉగ్రదాడులులో మృతి చెందిన వారికి బుధవారం సాయంత్రం జమ్మలమడుగులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ మేరకు డీవైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌లు మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడికి పాల్పడినటు వంటి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.