రాయుడి మృతి తీరనిలోటు: మంత్రి బీసీ

రాయుడి మృతి తీరనిలోటు: మంత్రి బీసీ

NDL: టీడీపీ సీనియర్ నేత, రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. టీడీపీ శ్రేణులకు, రాయచోటి నియోజకవర్గ ప్రజలకు రాయుడి మృతి తీరని లోటని, ఆయన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రాయుడు కుటుంబానికి మంత్రి బీసీ ప్రగాఢ సంతాపం తెలిపారు.