'మురుగు నీటిని తొలగించాలి'

KDP: సిద్దవటం మండలంలోని సంటిగారి పల్లి SC కాలనీలో గత కొన్ని రోజులుగా మురిగినీరు స్తంభించిపోయి దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మురుగు నీరు ఉండడంవల్ల దోమలు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు అంటున్నారు. గ్రామంలో విష జ్వరాలు సోకకుండా మురుగు నీరు తొలగింపు చర్యలకు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని పరిసర ప్రజలు కోరుతున్నారు.