బావిలో శవం.. శవం చేతిలో పుస్తెలతాడు

బావిలో శవం.. శవం చేతిలో పుస్తెలతాడు

TG: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 75 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు పుస్తెలతాడు కోసం పోరాడింది. ఓ దుండగుడు వృద్ధురాలి మీద ఉన్న బంగారం మొత్తం తీసుకున్నాడు. కానీ, ఆ వృద్ధురాలు పుస్తెలతాడు ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన దుండగుడు ఆమెను బావిలోకి తోసేశాడు. ఈ ఘటనలో వృద్ధురాలు చనిపోగా.. పుస్తెలతాడు వృద్ధురాలి చేతిలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.