దోమకొండలో పెద్దపులి కలకలం

దోమకొండలో పెద్దపులి కలకలం

KMR: దోమకొండ మండలం అంబర్‌పేట శివారులో ఆదివారం స్వామిగౌడ్ అనే రైతుకు చెందిన పశువుల దూడలపై జరిగిన దాడి గ్రామంలో కలకలం రేపింది. పాదముద్రల ఆధారంగా ఇది పెద్దపులి పనేనని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించగా, పులి కదలికలు ట్రాప్ కెమెరాలలో రికార్డయ్యాయి. దీంతో స్థానిక గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.