విద్యుత్ స్తంభం విరిగి కార్మికుడు మృతి

NDL: గడివేముల మండలం కొరప్రోలూరు సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన విజయ్ కుమార్ 220 కేవీ సబ్ స్టేషన్ విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో సపోర్టింగ్ స్తంభం విరిగి పడటంతో అతను మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.