ఫ్లెక్సీలో ఫోటో.. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం

ఫ్లెక్సీలో ఫోటో.. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం వాగ్వివాదంగా మారింది. మంగళవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తమ ఫోటో లేదని ఏఎంసీ ఛైర్మన్ వర్గీయులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్గీయులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కాస్త గందరగోళ పరిస్థితుల్లో కొనసాగింది.