అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలి:కలెక్టర్

JGL: నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈనెల 4న నిర్వహించనున్న నీట్ పరీక్షలపై అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిధిలో రెండు పరీక్ష కేంద్రాల్లో 768 అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు.