వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
WGL: వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సత్యా శారదా శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న కలెక్టర్, వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఔట్‌పేషెంట్ విభాగం, ఇన్‌పేషెంట్ వార్డులు, అత్యవసర విభాగం, ఆమె పరిశీలించి పలు సూచనలు చేస్తూ, సేవల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.