తప్పిపోయిన పిల్లాడిని పట్టించిన డ్రోన్

తప్పిపోయిన పిల్లాడిని పట్టించిన డ్రోన్

NLR: తప్పిపోయిన పిల్లడిని డ్రోన్ కనిపెట్టిన ఘటన నెల్లురు జిల్లా పరిధిలో జరిగింది. పాత వెల్లంటికి చెందిన మనోజ్‌ను తల్లి దండ్రులు మందలించడంతో అలిగి మిద్ది మీదకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఎక్కడ వెతికిన కనపించకపోవడంతో అందోళన చెంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మిద్ది మీద బాలుడుని గుర్తించి కుటుంబ సభ్యులకు అందించారు.