పాక్ ఇంధన పొదుపు.. త్వరగా మార్కెట్ల మూసివేత
ఇంధన పరిరక్షణ కోసం పాక్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. ఏప్రిల్ 7 నుంచి దేశవ్యాప్తంగా మార్కెట్లు, మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లకు రా.10 వరకు అనుమతినిచ్చారు. ఇంధన ఆదా కోసం గిల్గిత్, ముజఫరాబాద్‌లో ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆర్థిక సంక్షోభంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.