గోశాలకు పశువుల ఫీడ్ అందజేత
W.G: లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు రాంబాబు, ప్రసాద్ ఆధ్వర్యంలో భీమవరం గోశాలకు పశువుల ఫీడ్ అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హైందవ ధర్మంలో ఆవుకు ప్రత్యేక స్థానం ఉందని, హిందువులు గోవును దేవతగా పూజిస్తారని తెలిపారు. వ్యవసాయానికి మూలమైన గో సంపదను ప్రతి ఒక్కరూ రక్షించి, సేవ చేయాలని కోరారు.