వెబ్‌సిరీస్‌లో కిరణ్ అబ్బవరం.. గ్లింప్స్ రిలీజ్

హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు భరత్ కమ్మ కాంబినేషన్‌లో వెబ్‌సిరీస్ రానుంది. తాజాగా టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా వదిలారు. ఈ సిరీస్‌కు గువ్వల చెరువు ఘాట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కాగా ఇందులో తిరువీర్, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషించారు.