ఆటో, బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

ఆటో, బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

KNR: గన్నేరువరం మండలంలో, కాసింపేట గ్రామానికి వెళ్లే మార్గంలో ఆదివారం ట్రాలీ ఆటో, పల్సర్ బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న పున్నం రాకేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ ఆటోకి తగలడంతో రాకేష్ కొంత దూరం ఈడ్చుకెళ్లబడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి, రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న రాకేష్‌ను కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు.