నేడు డయల్ యువర్ సీఎండీ
VSP: విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి తదితర జిల్లాలకు చెందిన వినియోగదారులు 8688400499 నెంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చని అన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.