వైరా 10వ వార్డులో కిన్నెర కృష్ణ విజయం
KMM: వైరా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీపీఎం తన ఖాతా తెరిచింది. పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్‌గా బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి కిన్నెర కృష్ణ ఘనవిజయం సాధించారు. తన గెలుపుకు సహకరించిన సీపీఎం, బీఆర్ఎస్ శ్రేణులతో పాటు వార్డు ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.