దేవాలయ శిలా తోరణం అపహరణం

దేవాలయ శిలా తోరణం అపహరణం

NLG: మర్రిగూడ మండలంలోని సరంపేట గ్రామ శివారులో గత 500 ఏళ్ల పురాతన శ్రీ స్తంభగిరి లక్ష్మీనరసింహ దేవాలయం ముందు ఉన్న రాతి స్తంభం‌పై ఉన్న దీప తోరణాన్ని ఆదివారం అర్ధరాత్రి దుండగులు ఎత్తుకెళ్లారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఆలయ కళ్యాణ మండపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.