హైదరాబాద్ పోలీసులను అభినందించిన DY.CM
KKD: సినిమా పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు DY.CM పవన్ కల్యాణ్ తన X ఖాతాలో హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వీ.సీ.సజ్జనార్‌కు అభినందనలు తెలిపారు. పైరసీల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని, ఈ వెబ్ సైట్ల నిర్వాహకుడిని అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామని పేర్కొన్నారు.