ఆపరేషన్ సింధూర్.. సీఎం కీలక ఆదేశాలు

TG: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అధికారులతో భేటీ అయిన సీఎం రేవంత్ కీలక ఆదేశాలు చేశారు. అత్యవసర సర్వీసుల ఉద్యోగుల సెలువులను రద్దు చేశారు. 'మంత్రులు, అధికారులు అందుబాటులో ఉండాలి. బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు పెట్టుకోవాలి. అత్యవసర ఔషధాలను సిద్ధం చేసుకోవాలి. సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి మనం ఉన్నామనే సందేశం ఇవ్వాలి' అని పేర్కొన్నారు.