'విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి'

'విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి'

ELR: నూజివీడులోని సిద్ధార్థ బీఫార్మసీ కళాశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అనూష మాట్లాడుతూ.. మహిళలను, చిన్నారులను అక్రమ రవాణా చేసేవారు సమాజంలో పొంచి ఉన్నారని హెచ్చరించారు. డబ్బు ఆశ చూపి, ప్రేమ పేరుతో మాఫియా అక్రమ రవాణా చేస్తుందన్నారు.