ఓట్లు లాగేందుకు లంచం: ప్రియాంకాగాంధీ
రూ.10 వేలు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టవచ్చని BJP భావిస్తోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ ఆరోపించారు. 'ఒకప్పుడు మహాత్మాగాంధీ చేసిన పోరాటమే కాంగ్రెస్ చేస్తోంది. ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని తన ఇద్దరు కార్పొరేట్ స్నేహితులకే అప్పగిస్తున్నారు. ఆయన తుపాకీ వంటి పదాలను ఉపయోగించి, ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు' అని విమర్శించారు.