పల్నాడు పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేకమైన గుహాలయమిదే

పల్నాడు పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేకమైన గుహాలయమిదే

పల్నాడు జిల్లా గురజాలలో వెలసిన దైద అమరలింగేశ్వర స్వామి ఆలయం ఒక ప్రత్యేకమైన ప్రకృతి సిద్ధమైన గుహ(బిలం) ఆలయం. ఇది సుమారు 120 ఏళ్ల క్రితం కనుగొనబడింది. ఈ ఆలయ సమీపంలో కృష్ణానది ఉత్తర దిశగా ప్రవహిస్తోంది. దీనిని హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ గుహలలో అగస్త్య మహాముని తపస్సు చేశారని స్థల పురాణం చెబుతోంది. కాగా, ఇక్కడి ప్రజలకు ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం.