తెగిన చెక్‌డ్యాం.. నిలవని సాగునీరు
MBNR: మిడ్జిల్ మండలంలో దుందుబి వాగుపై పదేళ్ల కిందట రూ. 1.10 కోట్ల ఖర్చుతో చెక్‌డ్యాం నిర్మించారు. భారీ వరదలకు ఈ చెక్ డ్యాం కొట్టుకుపోవడంతో వాగు వరదతో పాటు ఇందులోకి వచ్చే కేఎల్ నీరు దిగువకు పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెక్‌డ్యాం ఉన్న సమయంలో వివిధ రకాల పంటలు సాగుచేసే వాళ్లమని రైతులు తెలిపారు. ఇప్పటికైనా స్పందించి చెక్‌డ్యాం నిర్మించాలని కోరుతున్నారు.