ఉపాధి మార్గంగా పురుషుల పొదుపు సంఘాలు..!
NLR: మహిళల తరహాలోనే నెల్లూరు అర్బన్, కావలి, ఆత్మకూరు, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెంలో మెప్మా ఆధ్వర్యంలో పురుషుల పొదుపు సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్మికులతో 140 గ్రూపులు ఏర్పడగా, తొలివిడతగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 60 గ్రూపులకు రూ.42 లక్షల రుణాలు మంజూరు చేశారు. సకాలంలో చెల్లిస్తే మరింత సాయం, వృత్తి శిక్షణ అందిస్తారు.