అమ్మవారి సేవలో ఎంపీ

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం ఎంపీ పాకా సత్యనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం ఆలయ అధికారులు మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆయనకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, శ్వాస వస్త్రంతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.