నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
కృష్ణా: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా పమిడిముక్కల మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలపారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అలినఖీపాలెం, ముసలనాయకునిపాలెం, చోరగుడి, గోపాలకృష్ణ పురం ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని చెప్పారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.