గురుకుల పాఠశాల ఘటనపై ఆరా

గురుకుల పాఠశాల ఘటనపై ఆరా

TPT: ఓజిలి మండలం వాకాటివారి కండ్రిగలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య సందర్శించారు. విద్యార్థులను టీచర్లు కొట్టడంపై ఆయన ఆరా తీశారు. ప్రిన్సిపల్ పవన్ కుమార్ సింగ్‌తో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట వైసీపీ మండల కన్వీనర్ పాదర్తి హరనాథ్ రెడ్డి, ఎంపీపీ గడ్డం అరుణ రెడ్డి పాల్గొన్నారు.