అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత
NRML: అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తానూర్ RI నరేశ్ హెచ్చరించారు. మహారాష్ట్ర నుంచి భైంసాకు ఇసుక తరలుతున్నట్లు సమాచారం రావడంతో శనివారం దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న ఒక వాహనాన్ని పట్టుకుని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.