కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే
GNTR: పొన్నూరు ఆర్టీసీ డిపో నుంచి ఆరెమండ, నంబూరు గ్రామాలకు కొత్త బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా సౌకర్యాల మెరుగుదలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ప్రయాణికుల కోసం డిపోలో ఏర్పాటు చేసిన వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆర్వో వాటర్ ప్లాంట్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు.