నీట్ పరీక్షకు 3,222 మంది అభ్యర్థుల హాజరు

SRD: సంగారెడ్డి జిల్లాలోని ఏడు పరీక్ష కేంద్రాల్లో నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 3,320 మందికి 3,222 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. 98 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు.