VIDEO: స్కూల్‌కి తాళం.. ఇంటికి వెళ్లిపోయిన విద్యార్థులు

VIDEO: స్కూల్‌కి తాళం.. ఇంటికి వెళ్లిపోయిన విద్యార్థులు

సూర్యాపేటలోని తిలక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం వేసిన ఘటన చోటుచేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా అద్దె భవనంలో ప్రభుత్వ పాఠశాలను నడుపుతున్నారు. మూడు సంవత్సరాలుగా భవనానికి కిరాయి ఇవ్వట్లేదని భవన యజమాని పాఠశాలకు తాళం వేశాడు. దీంతో స్కూల్‌కు వచ్చిన విద్యార్థులు బయటనే వేచి ఉండి ఇంటికి వెళ్లిపోయారు. మూడేళ్ల కిరాయి ఇవ్వాల్సి ఉంది అని భవన యజమాని వాపోయాడు.