కందుకూరులో వృద్ధ దంపతుల ఆత్మహత్య

కందుకూరులో వృద్ధ దంపతుల ఆత్మహత్య

NLR: కందుకూరులో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని కోవూరు రోడ్డులో నివసిస్తున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం పురుగు మందు తాగిన ఇద్దరిని కందుకూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఒకరు మరణించారని తెలిసింది. చికిత్స పొందుతూ మరొకరు కూడా మరణించారని సమాచారం. దంపతుల ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది విచారణలో తేలాల్సి ఉంది.