ప్రజాదర్భార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజాదర్భార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి వివిధ రకాల ఫిర్యాదులు, వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రతీ సమస్యను విడివిడిగా పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.