'తర్లుపాడులో మండల స్థాయి సైన్స్ ఫెయిర్'
ప్రకాశం: తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ మండల స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MEO -2 అచ్యుత సుబ్బారావు హాజరై, ప్రారంభించారు. విద్యార్థుల్లో ఉన్న టాలెంట్‌ను గుర్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్, టీచర్లు శ్రీనివాస్, చంద్రశేఖర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.