రేపు రైతు నేస్తం కార్యక్రమం
KMM: కూసుమంచి మండలంలోని కూసుమంచి, గట్టుసింగారం, నాయకన్ గూడెం రైతు వేదికలలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ఉంటుందని ఏవో రామడుగు వాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీసీఐ కేంద్రాలలో ప్రత్తి విక్రయం ఏ విధంగా చేయాలి, కిసాన్ కపాస్ యాప్‌ను ఏ విధంగా వినియోగించాలి, మొక్కజొన్న కొనుగోలు వంటి అంశాలపై చర్చ ఉంటుందన్నారు.