కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ADB: సిరికొండ మండలం తహసీల్దార్ కార్యాలయంలో 27 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను శుక్రవారం ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని, ప్రతి ఒక్కరు CM రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పైన చేస్తున్న కార్యక్రమాలను గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.